హిందూ ఆధ్యాత్మిక వేది మానవ జీవిత లక్ష్యం ఏమిటి ? ఆత్మ జ్ఞానం విలువైనదే గాని అంత సులువైనది కాదు. ఇట్టి జ్ఞానాన్ని పొందటానికి ఒక్క మానవ జన్మ మాత్రమే అర్హమైనది. జంతువులు గాని, చెట్లు గాని, దేవతలు గాని ఆత్మ జ్ఞానాన్ని పొందే హక్కు లేదు. కర్మ చేయటానికి అధికారం మానవులకు మాత్రమే ఉన్నది. అలాగని మానవులందరూ తమ జన్మలను ఆత్మాను భూతికి ఉపయోగించు కుంటారా ? అంటే లేదు. ఎందుకంటే : 1. ఆత్మాను భూతిని పొందాలని, అదే మానవ జీవిత పరమ లక్ష్యమని ముందు తెలియాలి. 2. ఆత్మాను భూతి ని పొందాలనే పట్టుదల కలగాలి. 3. పొందే విధానం తెలుసుకోవాలి. 4. పొందటానికి ఆటంకంగా ఉన్న దోషాలను తొలగించు కోవాలి. 5. మార్గం చూపే సద్గురువు లభించాలి. 6. ఆయన చూపిన మార్గంలో పట్టుదలగా ప్రయాణించాలి. అందుకే లోకంలో ఈ జ్ఞానాన్ని పొందేవారు అరుదుగా ఉంటారని భగవానుడు తెలియ జేస్తున్నాడు. పిల్లి తన కూనలను కళ్ళు తెరిచే లోపల తట్టలలో, బుట్టలలో, గాదెలలో, గంపలలో మారుస్తుందట. అలా ఏడు చోట్ల మారుస్తుందంటారు. అలాగే 'మాయ' అనే పెద్ద పిల్లి ఈ జీవులను కళ్ళు తెరిచే లోపల ఎన్ని చోట్ల మార్చింది ? 83 లక్షల 99వేల 999 గాదెలలో, గంపలలో, వివిధ గర్భ కోశాలలో చేర్చింది. మా...