Posts

Showing posts from March, 2022
Image
గోమాత‌కు ఎలాంటి ఆహారాన్ని పెడితే -  ఎలాంటి ఫ‌లితాలు క‌లుగుతాయో -  తెలుసుకొందాము!!!  1. గోమాత‌ల‌కు నాన‌బెట్టిన శ‌న‌గ‌ల‌ను తినిపిస్తే ఆధ్యాత్మిక చింత‌న ల‌భిస్తుంద‌ట‌. స‌న్మార్గంలో న‌డ‌వ‌వచ్చ‌ట‌. దైవ చింత‌న పెరుగుతుంద‌ట‌. 2. మీకు ఎవ‌రైనా శ‌త్రువులు ఉంటే గోమాత‌ల‌కు దోస‌కాయ‌ల‌ ను పెట్టాల్సి ఉంటుంది. దీంతో శ‌త్రు నివార‌ణ జ‌రుగుతుంది. 3. గోమాత‌ల‌కు బెండ‌కాయ‌ల‌ ను తినిపిస్తే మ‌నోస్థైర్యం పెరుగుతుంది. ఏ ప‌ని చేయ‌డానికైనా కావ‌ల్సినంత ధైర్యం వ‌స్తుంది. 4. బాగా అప్పులు ఉన్న వారు నాన‌బెట్టిన కందుల‌ ను గోమాత‌కు తినిపించాలి. దీంతో రుణ విముక్తి చెందుతారు. 5. కుటుంబంలో క‌ల‌హాలు ఉన్న వారు, అస్త‌మానం కుటుంబంలో స‌భ్యుల‌తో గొడ‌వలు ప‌డుతూ ఉండేవారు గోమాత‌ల‌కు నాన‌బెట్టిన ప‌చ్చి శ‌న‌గ‌ల‌ ను తినిపిస్తే ఫ‌లితం ఉంటుంది. 6. పిల్ల‌లు విద్యారంగంలో ఎద‌గాలంటే వారి త‌ల్లిదండ్రులు గోమాత‌ల‌కు నానబెట్టిన పొట్టు పెస‌ర ప‌ప్పును తినిపించాల్సి ఉంటుంది. 7. గోమాత‌కు నాన‌బెట్టిన ఛాయ పెస‌ర‌ప‌ప్పు పెడితే ఇంద్రియ నిగ్ర‌హం క‌లుగుతుంది. 8. ఉద్యోగం రాకుండా ఉన్న‌వారు, దాని కోసం విశ్వ ప్ర‌య‌త్నం చేస్తున్న‌వారు గోమాత‌కు...
Image
పుత్రులు ఎన్ని రకములుగా జన్మిస్తారు  ? ❤️ పుత్రులు ఏడు రకాలుగా జన్మిస్తారు.... 💕 గతజన్మలో తన సొమ్మును దాచమని ఒక వ్యక్తికి ఇచ్చి, తన సొమ్మును తిరిగి తీసుకోకుండానే మరణించినవాడు తాను దాచిన సొమ్ము తీసుకోవడానికి ఆ ఇంట్లో పుత్రుడుగా జన్మిస్తాడు. 💕 తాను పూర్వ జన్మయందు బాకీపడిన అప్పును (ఋణాన్ని) తిరిగి చెల్లించుటకు పుత్రుడుగా జన్మిస్తాడు. 💕 పూర్వ జన్మలోని శత్రుత్వం తీర్చుకోవడానికి ఈ జన్మలో పుత్రునిగా జన్మిస్తాడు. 💕 పూర్వ జన్మలో తనకు ఒకడు అపకారం చేసాడు. దానికి ప్రతీకారం తీర్చుకోలేదు. ఈ జన్మలో ప్రతీకారం తీర్చుకోవడానికి అపకారం చేసినవాడికి పుత్రునిగా జన్మిస్తాడు. 💕 పూర్వ జన్మలో తాను అనుభవించిన సేవ,సుఖములకు బదులు తీర్చడానికి పుత్రునిగా జన్మించి తల్లిదండ్రులకు సేవ చేస్తాడు. 💕 పూర్వ జన్మలో తాను ఏ వ్యక్తి నుండి ఉపకారం పొందుతాడో, ఆ ఉపకారానికి బదులుగా ఉపకారం చేయుటకు పుత్రునిగా జన్మిస్తాడు. 💕 ఏమీ ఆపేక్షించనివాడు కూడా పుత్రునిగా జన్మించి, తన విధులను తీరుస్తాడు. 🌺 ఇలా పుత్రులుగా జన్మించినవారు కర్మానుసారముగా తమ పనులు పూర్తికాగానే మరణిస్తారు, లేదా దీర్ఘకాలం జీవించి ఉపకారం చేయడమో, ప్రతీకారం తీర్చు...
Image
నీ ఈజీవితంలో అసలైనతోడు ఎవరు  ? అమ్మనా? నాన్ననా? భార్యనా? భర్తనా? కొడుకా? కూతురా? స్నేహితులా? బంధువులా ? లేదు...   ఎవరూ కాదు.! నీ నిజమైన తోడు -   నీ శరీరమే !  ఒక్కసారి నీ శరీరం స్పందించడం ఆగిపోతే ఎవ్వరూ నీ దగ్గర ఉండరు గాక ఉండరు!!! నువ్వు అవునన్నా, కాదన్నా, ఇది కఠిన నిజం.!!! నీవూ నీ శరీరం మాత్రమే జననం నుండి మరణం దాకా కలిసి ఉంటారు. నీవు వాస్తవానికి ఆత్మ. ఈ శరీరమే నీ అసలైన ఇల్లు.   ఏదైతే నీ శరీరం కొరకు బాధ్యతగా చేస్తావో అదే నీకు తప్పక తిరిగి వస్తుంది. నీవెంత ఎక్కువ శ్రద్ధగా శరీరాన్ని  చూసుకుంటావో,నీ శరీరం కూడా నిన్ను అంతే శ్రద్ధగా  చూసుకుంటుంది. నీవేమి తినాలి? నీవేమి చేయాలి? ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలి? నీవెంత విశ్రాంతి తీసుకోవాలి? అనేవి మాత్రమే నీ శరీరం స్పందనను నిర్ణయిస్తాయి. గుర్తించుకో ! నీ శరీరమొక్కటే నీవు జీవిస్తున్న చిరునామా! నీ శరీరమే నీ ఆస్థి,సంపద. వేరే ఏదీ కూడా దీనికి తులతూగదు. నీ శరీరం నీ బాధ్యత... డబ్బు వస్తుంది. వెళ్తుంది. బందువులు.,స్నేహితులు శాశ్వతం కాదు. గుర్తుంచుకో.! నీ శరీరానికి ఎవరూ సహాయం చేయలేరు. ఒక్క నీవు తప్ప...! ఊపిరితిత...
Image
హిందూ ధర్మం జ్ఞానం మీద ఆధారపడి నడిచింది. జన్మ-జాతి మీద కాదు.  (వజ్రసూచికోపనిషత్తు ప్రకారం ..)  1. ఋష్యశృంగుడు .. జింకలు పట్టుకునే జాతులకు పుట్టినవాడు. 2. కౌశికుడు .. గడ్డి కోసుకునే జాతికి చెందినవాడు. 3. జంబూక మహర్షి .. నక్కలు పట్టుకునే జాతివారు .. 4. వాల్మీకి .. ఓ కిరాతకుల జాతికి చెందిన వాడు. ఈతను రచించిన రామాయణం .. హిందువులకు పరమ పవిత్రమైన గ్రంథం. ఈయన్ని ఆదికవిని చేసి పూజిస్తారు. 5. వ్యాసుడు .. ఓ చేపలుపట్టే బెస్తజాతికి చెందినవాడు. హిందువులకు పరమపవిత్రమైన వేదములు .. ఈయన చేత విభజన చేయబడ్డవే. అందుకే ఇతణ్ణి వేదవ్యాసుడు .. అని పూజిస్తారు.  6. గౌతముడు .. కుందేళ్లు పట్టేజాతికి చెందినవాడు. 7. వశిష్టుడు .. ఓ వేశ్యకు పుట్టినవాడు. కనీసం తండ్రి ఎవరో కూడా తెలియదు. ఈతని భార్య మాదిగ స్త్రీ అయిన అరుంధతీదేవి. ఈరోజుకు కూడా నూతన దంపతులచేత అరుంధతీవశిష్టులకు నమస్కారం చేసే సాంప్రదాయాన్ని పాటిస్తున్నారు. ప్రతి పూజలోనూ హిందువులచేత .. అరుంధతీవశిష్ఠాభ్యాం నమః .. అని పూజలందుకుంటున్నారు.  వీరి కుమారుడు శక్తి. ఇతని భార్య ఓ మాదిగ వనిత .. ఛండాలాంగని. వీరికుమారుడే పరాశరుడు. ఈతను ఓ బెస్తవనిత...
Image
🚩   శివాలయాలు - వాటి విశిష్టత 🔰  శాస్త్రవేత్తలకే అర్థంకాని శివాలయాలు 🔰 మహానంది  శివలింగ అడుగునుండి వచ్చే నీటితో కొన్నివేల ఎకరాలు పంటభూమి పండుతున్నది.  బయట ఉండే కొనేరులో గుండుసూది వేసినా కనపడుతుంది. ఎంత చలికాలంలో కూడా కొనేరులో నీరు గోరు వెచ్చగా ఉంటుంది. 🔰  ప్రకాశం జిల్లా పొన్నలూరు మండలం (కందుకూరు కనిగిరి మధ్య ) కె. అగ్రహారంలో ని కాశివిశ్వేశ్వర దేవాలయం లోని శివలింగం క్రిందనుండి నీరు ఊరుతూ ఉంటుంది. ఈ నీరు 14గ్రామాలకు తాగునీరుగా వాడుతున్నారు. 🔰   ఆదిలాబాద్ జిల్లాలోని  శ్రీ బుగ్గా రామేశ్వరాలయం.   ఈఅలయంలో  శివలింగంనుండి నీరు ఊరుతూ ఉంటుంది. 🔰  కరీంనగర్ జిల్లాలో కాళేశ్వరము దేవాలయం లో  నంది ఉత్తరాయణంలో ఉత్తరముఖంగాను దక్షిణాయణంలో దక్షిణ వైపు తిరుగుతారు.ఇది వండర్ 🔰  అలంపూర్ బాల బ్రహేశ్వర లింగా నికి ఎన్ని నీళ్ల ట్యాకులతోనైనా అభిషేకం చెయ్యండి .కానీ ఆనీరు ఎటుపోతుందో ఎవ్వరికీ తెలియదు. 🔰  వరంగల్ జిల్లా  వెయ్యిస్తంభాల గుడి ఇక్కడ సంగీత స్తంభాలు గలవు. ఇక్కడ నందిని మీటితే కంచు శబ్దం వస్తుంది. 🔰  ద్రాక్షారామం ఈ శివలింగ...
Image
 మజ్జిగ - మహా పానీయం  మజ్జిగ కి సంస్కృతంలో మూడు పేర్లున్నాయి 1. తక్రం   2. మధితం   3. ఉదశ్విత్తు  🔸 తక్రం  నాలుగోవంతు మాత్రం నీరుపోసి తయారు చేసేది తక్రం. 🔸 మధితం  అసలే నీరు పోయకుండా చిలికినది #మధితం ఇది రుచిగా ఉంటుంది, కానీ ఆరోగ్యానికి అంత ప్రశస్తం కాదు. 🔸 ఉదశ్విత్తు  సగం నీళ్లు పోసి తయారుచేసేది ఉదశ్విత్తు. ఈ మూడింటిలోకి తక్రం ఆరోగ్యానికి చాలా ప్రశస్తం. 🔸 మజ్జిగ మహా పానీయం   మజ్జిగ తాగేవాడికి ఏ వ్యాధులూ కలగవనీ, వచ్చిన వ్యాధులు తగ్గి, తిరిగి తలెత్తకుండా ఉంటాయనీ, విషదోషాలు, దుర్బలత్వం, చర్మరోగాలు, దీర్ఘకాలిక వ్యాధులు, కొవ్వు, అమిత వేడి తగ్గిపోతాయనీ, శరీరానికి మంచి వర్చస్సు కలుగుతుందనీ, యోగరత్నాకరం లో ఉన్నది. దేవలోకంలో దేవతల కోసం అమృతాన్నీ, ఇక్కడ మానవుల కోసం మజ్జిగనీ భగవంతుడు సృష్టించాడట.. వేసవి కాలంలో మనం మజ్జిగ ఎక్కువగా తీసుకోవాలి. తోడుపెట్టినందు వలన పాలలో ఉండే పోషక విలువలన్నీ మజ్జిగలోనూ పదిలంగా ఉండటంతో పాటు, అదనంగా లాక్టో బాసిల్లై అనే మంచి బాక్టీరియా మనకు దొరుకుతుంది.  పాలలో ఈ ఉపయోగకారక బాక్టీరియా ఉండదు.  ప్రిజ్జులో పె...