పుత్రులు ఎన్ని రకములుగా జన్మిస్తారు  ?

❤️ పుత్రులు ఏడు రకాలుగా జన్మిస్తారు....

💕 గతజన్మలో తన సొమ్మును దాచమని ఒక వ్యక్తికి ఇచ్చి, తన సొమ్మును తిరిగి తీసుకోకుండానే మరణించినవాడు తాను దాచిన సొమ్ము తీసుకోవడానికి ఆ ఇంట్లో పుత్రుడుగా జన్మిస్తాడు.

💕 తాను పూర్వ జన్మయందు బాకీపడిన అప్పును (ఋణాన్ని) తిరిగి చెల్లించుటకు పుత్రుడుగా జన్మిస్తాడు.

💕 పూర్వ జన్మలోని శత్రుత్వం తీర్చుకోవడానికి ఈ జన్మలో పుత్రునిగా జన్మిస్తాడు.

💕 పూర్వ జన్మలో తనకు ఒకడు అపకారం చేసాడు. దానికి ప్రతీకారం తీర్చుకోలేదు. ఈ జన్మలో ప్రతీకారం తీర్చుకోవడానికి అపకారం చేసినవాడికి పుత్రునిగా జన్మిస్తాడు.

💕 పూర్వ జన్మలో తాను అనుభవించిన సేవ,సుఖములకు బదులు తీర్చడానికి పుత్రునిగా జన్మించి తల్లిదండ్రులకు సేవ చేస్తాడు.

💕 పూర్వ జన్మలో తాను ఏ వ్యక్తి నుండి ఉపకారం పొందుతాడో, ఆ ఉపకారానికి బదులుగా ఉపకారం చేయుటకు పుత్రునిగా జన్మిస్తాడు.

💕 ఏమీ ఆపేక్షించనివాడు కూడా పుత్రునిగా జన్మించి, తన విధులను తీరుస్తాడు.

🌺 ఇలా పుత్రులుగా జన్మించినవారు కర్మానుసారముగా తమ పనులు పూర్తికాగానే మరణిస్తారు, లేదా దీర్ఘకాలం జీవించి ఉపకారం చేయడమో, ప్రతీకారం తీర్చుకోవడమో చేస్తారు.

❤️ కేవలం పుత్రులే కాదు, భార్య - భర్త - సోదరుడు - పనిమనిషి - ఆవు - కుక్క మొదలైన పశువులు కూడా కర్మరుణం తీర్చుకోవడానికి మనతో ఉంటారు.

💕 ”బుుణానుబంధ రూపేణా పశు పత్నీ సుతాలయాః” అన్నారు కదా ఋణము తీరగానే వదిలి వెళ్ళడమో, పరలోకానికి చేరడమో జరుగుతుంది.

❤️ బుుణ సంబంధమే లేనప్పుడు పుత్రులు కలగరు. పుత్రులు లేనివాళ్లు తాము ఎవరికీ బుుణపడిలేమనీ, తమకు ఎవరూ బుుణపడి లేరనీ తృప్తిపడి సంతృప్త జీవనాన్ని సొంతం చేసుకోవాలి.


ఆస్ట్రో గురు - త్రికాలజ్ఞాన విభూషణ

పండిత డా. గానుగుల యుగంధరాచార్య గురూజీ ......🖋

విజయవాడ

చరవాణి : 76 984 66 666, 93 96 96 26 36

Comments

Popular posts from this blog