Posts

Image
ఆహార దోషం మనం తీసుకునే ఆహారంలో ఐదు విధాలైన దోషాలు యిమిడివున్నాయి. 1.  అర్ధ దోషం 2.  నిమిత్త దోషం          3.  స్ధాన దోషం 4.  గుణ దోషం    5.  సంస్కార దోషం ఆహారం తీసుకొనే ముందు ఈ 5 దోషములు తెలుసుకొనుట చాలా ముఖ్యం.  1. అర్ధ దోషం : ఒక సాధువు  తన శిష్యుని ఇంటికి భోజనానికెళ్ళాడు. భోజనం చేస్తున్నప్పుడు ఎవరో  ఒకవ్యక్తి  వచ్చి ఆ శిష్యునికి  ధనంతో వున్న మూటని ఇవ్వడం చూశాడు. భోజనంచేసి, సాధువు ఒకగదిలో విశ్రాంతి తీసుకోసాగాడు. ఆ గదిలోనే  శిష్యుడు దాచినడబ్బు మూటవుంది. హఠాత్తుగా సాథువు మనసులో దుర్భుధ్ధి కలిగింది. ఆ మూటలో నుండి కొంచెం డబ్బు తీసుకుని తనసంచీలో దాచేశాడు. తర్వాత శిష్యుని వద్ద సెలవుతీసుకుని, తిరిగి తన ఆశ్రమానికి వెళ్ళిపోయాడు. మరునాడు పూజా సమయంలో తను చేసినపనికి సిగ్గుతో పశ్చాత్తాపం చెందాడాసాధువు.   తను శిష్యుని ఇంట్లో చేసిన దోషభూయిష్టమైన భోజనంవల్లనే తనకా దుర్బుద్ధి కలిగిందని రాత్రి ఆహారం జీర్ణమయి, ప్రొద్దున్నే  మలంగా విసర్జించబడిన తర్వాత మనసు నిర్మలమై పరిశుద్ధమైనట్టు అర్థంచేసుకున్నాడు. వెం...

అరుణాచల క్షేత్రం

Image
భక్తిని, ముక్తిని ప్రసాదించే అరుణాచల క్షేత్రం సృష్టి అంతయూ పంచభూతములచే జనించి, అంతిమంగా వాటిలోనే లీనమువుతుంది. అందుకే పంచభూతాలైన పృథ్వి, జలం, అగ్ని, వాయువు, ఆకాశమనే ఈ ఐదింటికీ సనాతన ధర్మంలో పెద్ద పీటవేసారు.  అంతేకాక పంచభూతాలకి అధిపతి అయిన పరమేశ్వరుని భక్తితో ఆరాధిస్తారు. నిరాకారుడైన ఆ ఈశ్వరుడు కూడా. పంచభూత లింగాలుగా అవతరించి భక్తులచే పూజలందుకుంటున్నాడు.  కోరిన కోరికలను అనుగ్రహిస్తూ మోక్షమార్గం వైపు నడిపిస్తున్నాడు. అరుణాచలం ప్రశస్తి : పంచభూత లింగాల క్షేత్రాలలో అరుణాచలం ఒకటి.  ఈశ్వరానుగ్రహం ఉంటేకానీ ప్రవేశం పొందలేని ప్రదేశం అరుణాచలం. "అరుణ" అంటే "ఎర్రని", "అచలం" అంటే "కొండ"... "అరుణాచలం అంటే ఎర్రనికొండ" అని అర్థం.   తిరువణ్ణామలైగా పిలువబడే ఈ శైవక్షేత్రం పొరుగున ఉన్న తమిళనాడు రాష్ట్రంలో ఉంది.  ఇక్కడ పరమశివుడు పంచభూత లింగాలలో ఒకటైన "అగ్ని లింగంగా దర్శనమిస్తాడు. మిగిలినవి కంచిలో పృథ్వీలింగం, శ్రీకాళహస్తిలో వాయులింగం, జంబుకేశ్వరంలో జలలింగం, చిదంబరంలో ఆకాశలింగంగా పరమేశ్వరుడు లింగ రూపంలో కొలువై ఉన్నాడు".   పురాణాలలో కొనియాడబడిన అరుణా...

దేవాలయంలో ఎందుకు కూర్చోవాలి

  🚩 హరి ఓం దేవాలయంలో ఎందుకు కూర్చోవాలి మీరు గుడి లోనికి వెళ్లినప్పుడు దేవుని ముందు నిల్చుని మీ రెండు చేతులను జోడించి, కళ్ళు తెరిచి ప్రశాంతమైన మనసుతో దర్శనం చేసుకోండి. దర్శనం అయ్యి గుడి బయటకు వచ్చాక గుడి మండపంలో కూర్చుని కళ్ళు మూసుకుని అప్పుడు మళ్లీ భగవంతుని రూపాన్ని గుర్తుకు తెచ్చుకుని ఆయనను ఈ క్రింది విధముగా అడగండి. శ్లో: అనాయాసేన మరణం వినా దైన్యేన జీవనం | దేహాంతే తవ సాన్నిధ్యం దేహిమే పరమేశ్వరం || అనాయాసేన మరణం నాకు నొప్పి లేక బాధ లేని మరణాన్ని ప్రసాదించు. వినా ధైన్యేన జీవనం నాకు ఎవరి మీదా ఆధారపడకుండా,నేను జీవితంలో ఎవరి ముందూ తలవంచకుండా, ఎవరినీ నొప్పించకుండా, నేను ఎవరి వద్దా చులకన కాకుండా ఉండే జీవితాన్ని ప్రసాదించు. దేహాంతే తవ సాన్నిధ్యం మృత్యువు నావద్దకు వచ్చినప్పుడు నేనునిన్ను దర్శించుకునే విధంగా దీవించు. దేహిమే పరమేశ్వరం ఓ భగవంతుడా నాకు ఈ క్రింది మూడు వరములను ప్రసాదించమని నిన్ను ప్రార్ధిస్తున్నాను. 1. అనుక్షణం నీ ప్రార్ధనలోనే గడిపే విధముగా అనుగ్రహించు. నీ ప్రార్ధనతో నన్ను ఉత్తమమైన మార్గంలోకి తీసుకు వెళ్ళు. 2. ఎప్పుడూ కూడా నేను నిన్ను నాకు కానీ .... నా బిడ్డలకు కానీ ...సంపదల...
Image
నమస్కారం విలువ మహాభారత యుద్ధ సమయంలో "మీరు పక్షపాతంగా యుద్ధం చేస్తున్నారు" అని దుర్యోధనుడు అనిన వ్యంగ్యమైన మాటలకు బాధపడి భీష్మ పితామహడు "నేను రేపు పాండవులను చంపుతాను" అని ప్రకటించాడు. అంతే... పాండవుల శిబిరంలో ఆందోళన పెరిగింది. భీష్ముని సామర్ధ్యం గురించి అందరికీ తెలుసు కాబట్టి, చెడు భయంతో కలవరపడ్డారు. అప్పుడు.. శ్రీ కృష్ణుడు తన వెంట ద్రౌపదిని తీసుకొని భీష్ముని శిబిరానికి వెళ్ళాడు. తను బైటే నిలబడి ద్రౌపదితో "నీవు వెళ్లి భీష్మునికి నమస్కరించు, ఆయన "అఖండ సౌభాగ్యవతీ భవ" అని ఆశీర్వదిస్తాడు. తర్వాత జరిగేది గమనించు అన్నాడు. ద్రౌపది అలానే చేసింది, భీష్ముడు దీవించి, "ఏంటమ్మా! ఇంత రాత్రి ఒంటరిగా వచ్చారు. నిన్ను కృష్ణుడు తీసుకు వచ్చాడు కదా" అన్నాడు. దానికి ద్రౌపది "అవును తాతయ్యా.. అన్న శిబిరం బయట నిలబడి ఉన్నారు" అనింది. భీష్ముడు బయటకు వెళ్ళగా.. ఇద్దరూ ఒకరికి ఒకరు నమస్కరించు కున్నారు. వెంటనే భీష్ముడు.. నాకు తెలుసు కృష్ణా, మీరు ఇలా చేస్తారని. ప్రతిజ్ఞ కన్నా దీవెనకు ప్రభావం ఎక్కువ. నేను పాండవుల జోలికి రాకుండా ఉండేందుకు ఇలా చేయండి అని ఒక మార్గం ఉపద...
🚩 దేవుడంటే ఏంటి ?   పూజ చేయకపోతే ఏమవుతుందో తెలుసుకుందాం...   చిన్నపిల్లలే కాదు… నేడు చదువుకున్న పెద్దవాళ్ళు కూడా అడిగే ప్రశ్న ఇది. మనవాళ్లు వెంటనే చెప్పే సమాధానం… "అలా మాట్లాడితే కళ్లుపోతాయి" అని. మనకు భవవంతుని గురించి అవగాహనలేనప్పుడు, చెప్పడం చేతగానప్పుడు, మనం వాడే మాట అదే!. కళ్లు పోగొట్టడానికి దేవుడేం శాడిస్ట్‌ కాదు గదా ! మనం చెప్పాల్సిన సమాధానం అది కాదు. తెలియని వారికి అలా చెప్పడం వల్ల వారికి దేవునిపై మనసు విరిగే ప్రమాదం ఉందని గ్రహించాలి. పూజ అనేది కూడా ఒక యోగ ప్రక్రియ… మనసుతో చేసే వ్యాయామం… మన తెలివితేటలు, జ్ఞానం పెరగడానికి మన మెదడుని మనమే ట్యూన్‌ చేసుకునే ప్రక్రియ… "దీప ప్రజ్వలనం"  అనేది "త్రాటకం" అనే యోగ ప్రక్రియ. రోజూ ఓ మూడు నిమిషాలు నూనె దీపాన్ని తదేకంగా చూస్తే కంటి జబ్బులను అరికట్టవచ్చు అని పెద్దలు చెప్పిన మాట. ఏదైనా కష్టమైన మంత్రాన్ని ఓ 11 సార్లు జపిస్తే నాలిక మొద్దుబారదు. అది నాలికకు ఎక్సర్‌సైజ్‌. అందువల్ల ఎటువంటి కష్టమైన పదాలనైనా పలకగలిగే శక్తి వస్తుంది, ధారణ శక్తి పెరుగుతుంది. భాష మీద పట్టు పెరిగితే స్టేజ్‌ ఫియర్ కూడా‌ పోతుంది. పూజ అంటే చాదస్...
Image
రావణ బ్రహ్మ గురించి తెలుసుకోవలసిన సత్యాలు 1) రావణుడు - బ్రాహ్మణుడు! రావణుడి తండ్రి మానవుడు , బ్రాహ్మణుడైన విశ్రవసు బ్రహ్మ. రావణుడి తల్లి రాక్షస స్త్రీ అయిన కైకసి. వీళ్ళ సంతానం రావణుడు , కుంభకర్ణుడు , విభీషణుడు , సూర్పణఖ. రావణుడు బ్రాహ్మణుడు కానీ అతనిలో రాక్షస లక్షణాలే ఎక్కువ. తను లంకకు రాజే కానీ ఆటవికుడు. 2) తన చెల్లెలి ప్రేమ పెళ్ళి నచ్చని రావణుడు! రావణుడి చెల్లెలు సూర్పణఖ విద్యుత్ జిహ్వ అనే రాక్షసుడ్ని ప్రేమించింది.కానీ రావణుడికి తన చెల్లెలి ప్రేమ వ్యవహారం నచ్చలేదు . విద్యుత్ జిహ్వ రావణుడిని చంపి లంకకు రాజు కావాలనుకుంటున్నాడు అని రావణుని అనుమానం. కానీ తల్లి కైకసి రావణుడిని ఒప్పిస్తుంది. 3) సొంత చెల్లెలి భర్తను చంపిన రావణుడు! రావణుడు అంగీకరించినట్లు చెప్పినా మనసులో మాత్రం విద్యుత్ జిహ్వను చంపాలనుకుంటాడు.సమయం చూసుకుని రావణుడు తన సొంత చెల్లెలి భర్త ను చంపేస్తాడు. 4) సూర్పణఖ ముక్కూ చెవులు కోసినా పట్టించుకోని రావణుడు! తన భర్తను చంపినందుకు ప్రతీకారం తీర్చుకోవాలని సూర్పణఖ ఒక పధకం రచించింది.రావణుడిని చంపగాలవాడు కేవలం శ్రీ రాముడు మాత్రమే అని గ్రహించింది.రాముడితో వైరం కలగాలని త...
Image
ఉత్తములైన భార్యా భర్తల  లక్షణాలు ఉత్తమ  భర్త లక్షణాలు : కార్యేషు యోగీ, కరణేషు దక్షః రూపేచ కృష్ణః క్షమయా తు రామః భోజ్యేషు తృప్తః  సుఖదుఃఖ మిత్రం షట్కర్మయుక్తః ఖలు ధర్మనాథః   🌺 కార్యేషు యోగీ : పనులు చెయ్యడంలో ఒక యోగి వలె, ప్రతిఫలాన్ని ఆశించకుండా చెయ్యాలి.  🌺 కరణేషు దక్షః : కుటుంబాన్ని నడపడంలో, కార్యాలను నిర్వహించడంలో  నేర్పుతో, సంయమనంతో వ్యవహరించాలి. సమర్ధుడై ఉండాలి.  🌺 రూపేచ కృష్ణః : రూపంలో కృష్ణుని వలె ఉండాలి.  🌺 క్షమయా తు రామః : ఓర్పులో రామునిలాగా ఉండాలి.  🌺 భోజ్యేషు తృప్తః : భార్య వండినదాన్ని సంతృప్తిగా  భుజించాలి.  🌺 సుఖదుఃఖ మిత్రం : సుఖదుఃఖాలలో కుటుంబానికి మిత్రుని వలె అండగా ఉండాలి. మంచి చెడ్డలలో పాలు పంచుకోవాలి. ఈ 6 పనులు సక్రమంగా నిర్వర్తించే పురుషుడు ఉత్తమ భర్తగా కొనియాడబడతాడు. ఉత్తమ  భార్య  లక్షణాలు : కార్యేషు దాసీ, కరణేషు మంత్రీ, రూపేచ లక్ష్మీ, క్షమయా ధరిత్రీ, భోజ్యేషు మాతా, శయనేషు రంభా షట్కర్మ యుక్తా కుల ధర్మపత్నీ  🌺 కార్యేషు దాసీ : పనులు చెయ్యడంలో దాసి లాగా బద్ధకించకుండా పొందికగా, ఒద్దికగా, నిదానంగా ...