ఉత్తములైన భార్యా భర్తల లక్షణాలు
ఉత్తమ భర్త లక్షణాలు :
కార్యేషు యోగీ, కరణేషు దక్షః
రూపేచ కృష్ణః క్షమయా తు రామః
భోజ్యేషు తృప్తః సుఖదుఃఖ మిత్రం
షట్కర్మయుక్తః ఖలు ధర్మనాథః
🌺 కార్యేషు యోగీ :
పనులు చెయ్యడంలో ఒక యోగి వలె, ప్రతిఫలాన్ని ఆశించకుండా చెయ్యాలి.
🌺 కరణేషు దక్షః :
కుటుంబాన్ని నడపడంలో, కార్యాలను నిర్వహించడంలో నేర్పుతో, సంయమనంతో వ్యవహరించాలి. సమర్ధుడై ఉండాలి.
🌺 రూపేచ కృష్ణః :
రూపంలో కృష్ణుని వలె ఉండాలి.
🌺 క్షమయా తు రామః :
ఓర్పులో రామునిలాగా ఉండాలి.
🌺 భోజ్యేషు తృప్తః :
భార్య వండినదాన్ని సంతృప్తిగా భుజించాలి.
🌺 సుఖదుఃఖ మిత్రం :
సుఖదుఃఖాలలో కుటుంబానికి మిత్రుని వలె అండగా ఉండాలి. మంచి చెడ్డలలో పాలు పంచుకోవాలి.
ఈ 6 పనులు సక్రమంగా నిర్వర్తించే పురుషుడు ఉత్తమ భర్తగా కొనియాడబడతాడు.
ఉత్తమ భార్య లక్షణాలు :
కార్యేషు దాసీ, కరణేషు మంత్రీ,
రూపేచ లక్ష్మీ, క్షమయా ధరిత్రీ,
భోజ్యేషు మాతా, శయనేషు రంభా
షట్కర్మ యుక్తా కుల ధర్మపత్నీ
🌺 కార్యేషు దాసీ :
పనులు చెయ్యడంలో దాసి లాగా బద్ధకించకుండా పొందికగా, ఒద్దికగా, నిదానంగా పనులు చెయ్యాలి.
🌺 కరణేషు మంత్రీ :
మంచి సలహాలు, సూచనలు అందించడంలో మంత్రిలాగా ఉండాలి.
🌺 రూపేచ లక్ష్మీ :
రూపంలో లక్ష్మీ దేవి లాగా ఎల్లప్పుడూ కళకళలాడుతూ, చిరునవ్వు చిందిస్తూ సంతోషంగా ఉండాలి.
🌺 క్షమయా ధరిత్రీ :
కష్ట సమయాలలో, కుటుంబ నిర్వహణలో భూదేవి అంత ఓర్పును కలిగి ఉండాలి. తొందరపడి ఏ పని చేయకూడదు.
🌺 భోజ్యేషు మాతా :
భోజనం పెట్టేటప్పుడు తల్లి వలె ప్రేమగా పెట్టాలి.
🌺 శయనేషు రంభా :
పడకగదిలో రంభ లాగా ఉండాలి.
ఈ 6 పనులు సక్రమంగా చేసే స్త్రీ ఉత్తమ స్త్రీగా, ధర్మపత్నిగా కొనియాడబడుతుంది.
పండిత డా. గానుగుల యుగంధరాచార్య గురూజీ ......🖋
విజయవాడ
చరవాణి : 93 96 96 26 36

Comments
Post a Comment