Posts

Showing posts from May, 2022
Image
రావణ బ్రహ్మ గురించి తెలుసుకోవలసిన సత్యాలు 1) రావణుడు - బ్రాహ్మణుడు! రావణుడి తండ్రి మానవుడు , బ్రాహ్మణుడైన విశ్రవసు బ్రహ్మ. రావణుడి తల్లి రాక్షస స్త్రీ అయిన కైకసి. వీళ్ళ సంతానం రావణుడు , కుంభకర్ణుడు , విభీషణుడు , సూర్పణఖ. రావణుడు బ్రాహ్మణుడు కానీ అతనిలో రాక్షస లక్షణాలే ఎక్కువ. తను లంకకు రాజే కానీ ఆటవికుడు. 2) తన చెల్లెలి ప్రేమ పెళ్ళి నచ్చని రావణుడు! రావణుడి చెల్లెలు సూర్పణఖ విద్యుత్ జిహ్వ అనే రాక్షసుడ్ని ప్రేమించింది.కానీ రావణుడికి తన చెల్లెలి ప్రేమ వ్యవహారం నచ్చలేదు . విద్యుత్ జిహ్వ రావణుడిని చంపి లంకకు రాజు కావాలనుకుంటున్నాడు అని రావణుని అనుమానం. కానీ తల్లి కైకసి రావణుడిని ఒప్పిస్తుంది. 3) సొంత చెల్లెలి భర్తను చంపిన రావణుడు! రావణుడు అంగీకరించినట్లు చెప్పినా మనసులో మాత్రం విద్యుత్ జిహ్వను చంపాలనుకుంటాడు.సమయం చూసుకుని రావణుడు తన సొంత చెల్లెలి భర్త ను చంపేస్తాడు. 4) సూర్పణఖ ముక్కూ చెవులు కోసినా పట్టించుకోని రావణుడు! తన భర్తను చంపినందుకు ప్రతీకారం తీర్చుకోవాలని సూర్పణఖ ఒక పధకం రచించింది.రావణుడిని చంపగాలవాడు కేవలం శ్రీ రాముడు మాత్రమే అని గ్రహించింది.రాముడితో వైరం కలగాలని త...
Image
ఉత్తములైన భార్యా భర్తల  లక్షణాలు ఉత్తమ  భర్త లక్షణాలు : కార్యేషు యోగీ, కరణేషు దక్షః రూపేచ కృష్ణః క్షమయా తు రామః భోజ్యేషు తృప్తః  సుఖదుఃఖ మిత్రం షట్కర్మయుక్తః ఖలు ధర్మనాథః   🌺 కార్యేషు యోగీ : పనులు చెయ్యడంలో ఒక యోగి వలె, ప్రతిఫలాన్ని ఆశించకుండా చెయ్యాలి.  🌺 కరణేషు దక్షః : కుటుంబాన్ని నడపడంలో, కార్యాలను నిర్వహించడంలో  నేర్పుతో, సంయమనంతో వ్యవహరించాలి. సమర్ధుడై ఉండాలి.  🌺 రూపేచ కృష్ణః : రూపంలో కృష్ణుని వలె ఉండాలి.  🌺 క్షమయా తు రామః : ఓర్పులో రామునిలాగా ఉండాలి.  🌺 భోజ్యేషు తృప్తః : భార్య వండినదాన్ని సంతృప్తిగా  భుజించాలి.  🌺 సుఖదుఃఖ మిత్రం : సుఖదుఃఖాలలో కుటుంబానికి మిత్రుని వలె అండగా ఉండాలి. మంచి చెడ్డలలో పాలు పంచుకోవాలి. ఈ 6 పనులు సక్రమంగా నిర్వర్తించే పురుషుడు ఉత్తమ భర్తగా కొనియాడబడతాడు. ఉత్తమ  భార్య  లక్షణాలు : కార్యేషు దాసీ, కరణేషు మంత్రీ, రూపేచ లక్ష్మీ, క్షమయా ధరిత్రీ, భోజ్యేషు మాతా, శయనేషు రంభా షట్కర్మ యుక్తా కుల ధర్మపత్నీ  🌺 కార్యేషు దాసీ : పనులు చెయ్యడంలో దాసి లాగా బద్ధకించకుండా పొందికగా, ఒద్దికగా, నిదానంగా ...