Posts

Showing posts from December, 2021
Image
జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు - పనిచేసే విధానము పంచ జ్ఞానేంద్రియములు :   మన దేహంలో     బాహ్యవస్తు జ్ఞానాన్ని గ్రహించడానికి ఐదు జ్ఞానేంద్రియాలున్నాయి. శబ్దాన్ని గ్రహించడానికి చెవులూ , శీతోష్ణములను(స్పర్శ) గ్రహించడానికి చర్మము(త్వక్కు) , రుచులను లేక రసమును గ్రహించడానికి జిహ్వ(నాలుక) , రూపమును గ్రహించడానికి కనులు(చక్షువు) , వాసనలను(గంధము) గ్రహించడానికి ముక్కు(ఘ్రాణము) ఉన్నాయి. ఇవన్నీ సూక్ష్మాంశాలు. జ్ఞానేంద్రియమొక్కొక్కదాన్లో, ఒక మహాభూతపు అంశ మాత్రమే ఉండటం వల్ల ,   చెవి చూడలేదు ,   కన్ను వినలేదు. ఈ అయిదు జ్ఞానే౦ద్రియాలు తెచ్చే విషయాలను గ్రహించటానికి అంతః కరణంలో వీటన్నిటి     సత్వా౦శాలూ ఉంటాయి. సత్వాంశాలైదూ కలసి అంతఃకరణం ఏర్పడుతుంది. అంతఃకరణం మనస్సు ,   బుద్ది అని రెండు విధాలుగా   వృత్తి భేదంచేత చెప్పబడుతోంది. కర్మేంద్రియాలు : వాక్కు ,   చేయి ,   పాదము ,   గుదము ,   గుహ్యము అనేవి కర్మే౦ద్రియాలని     చెప్పబడతాయి. ఇవి కూడా సూక్ష్మంశాలే. మాంస వికారాలు కావు. వాక్కు   –   మాట్లాడతాం. పాణి (చేతులు)   – ...
Image
గృహప్రవేశానికి అనుకూలమైన సమయం ఏది, వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది వాస్తు ప్రకారం ఇంటికి నిర్మించిన తర్వాత ఆ ఇంట్లోకి ప్రవేశించే ముందు మంచి సమయం కోసం ఎదురు చూడడం అందరికీ తెలిసిందే. కొత్తగా నిర్మించిన గృహంలోకి ఎప్పుడు ప్రవేశిస్తే మంచిదనే విషయమై వాస్తుశాస్త్రం కొన్ని సూచనలు చేస్తోంది. దీని ప్రకారం సూర్యుడు కుంభరాశిలో సంచరించే కాలం మినహా మిగిలిన మాసాలన్నీ శుభప్రదమైనవిగా వాస్తుశాస్త్రం పేర్కొంటోంది. అదే సమయంలో కార్తీక, మార్గశిర మాసాలు మధ్యస్థ ఫలప్రదమైనవిగా వాస్తుశాస్త్రం చెబుతోంది. అలాగే నూతన గృహ ప్రవేశానికి ఉత్తరాయణం మంచి కాలమని వాస్తుశాస్త్రం ఘోషిస్తోంది. ఇక రిక్త తిథులైన చవితి, నవమి, చతుర్థీ తిథులు విడిచిపెట్టి మిగిలిన తిథులలో పూర్ణిమ, సప్తమి, అష్టమి, దశమి తిథులు శుక్ల పక్షము నందు ఏకాదశి, ద్వాదశి, త్రయోదశిలతో పాటు శుక్లపక్ష విదియ, తదియలు యోగ్యమైనవని. * దక్షిణ సింహద్వారము గల గృహమునకు సంబంధించి గృహ ప్రవేశానికి పాడ్యమి, షష్టి, ఏకాదశీ తిథులు మంచివి.  * తూర్పు, ఉత్తర సింహద్వారం కలిగిన ఇంటి గృహ ప్రవేశానికి పూర్ణ తిధులైన పంచమి, దశమి, పూర్ణిమా తిథులు. * పశ్చిమ సింహద్వార గృహానికి విదియ, సప్తమి...