Posts

Showing posts from November, 2020
Image
మంగళసూత్రం హిందూ వివాహ తంతులో మాంగల్యధారణే అతి ప్రధానమైనది. మాంగల్యానికే మంగళసూత్రం, తాళి, తాళిబొట్టు, పుస్తె, శతమానం అనే పేర్లతోబాటూ వివిధ రూపాలు కూడా ఉన్నాయి. మానవులకు మనువాడటం ఎంత ముఖ్యమో, మనువాడటానికి మంగళసూత్రం అంతే ముఖ్యం. మంగళసూత్రం  లేదా  మాంగళ్యం  హిందూ సాంప్రదాయంలో  పెళ్ళి  జరిగిన స్త్రీలు  మెడలో  ధరించే గొలుసు లాంటి వస్తువు. దీనిలో  తాళి  లేదా  తాళిబొట్టు , కొన్ని నల్ల  పూసలు  మొదలైనవి గుచ్చుకుంటారు. వివాహ సమయం నుండి స్త్రీలు మంగళ సూత్రం ధరించడం భారతీయ సంప్రదాయం. ఈ ఆచారం ఈనాటిది కాదు. పెళ్ళినాడు వరుడు వధువుకు తాళికట్టే సాంప్రదాయం ఆరో శతాబ్దంలోనే ఆరంభమయింది. మంగళ సూత్రం అనే శబ్దం సంస్కృతం నుండి పుట్టింది. సంస్కృతంలో 'మంగళ' అంటే శోభాయమానం, శుభప్రదం అనే అర్ధాలు ఉన్నాయి. సూత్రం అంటే తాడు, ఆధారమైనది అని అర్ధాలు ఉన్నాయి. సాధారణంగా మంగళసూత్రాన్ని 108 సన్నని పోగులు, దారాలు కలిపి దానికి పసుపు రాసి తయారు చేస్తారు. ఇలా కలపబడిన తొమ్మిది లేదా పదకొండు కలిపికూడా కొందరు తాళిని తయారు చేస్తారు. మంగళ సూత్రధారణ జరుగునపుడు ఈ మంత్రమును పఠ...
Image
జీవితంలో ముఖ్యమైన 3 ఈ మూడు విషయాలలో జాగ్రతగా ఉండు ! 1. నిన్ను నీవు పొగడుకొనుట 2. పరనింద 3.పరుల దోషాలను ఎంచుట ఈ మూడింటిని ఎల్లప్పుడూ జ్ఞాపకం ఉంచుకో ! 1. దైవ నామ స్మరణ 2.పరులను గౌరవించుట 3.నీలోని దోషాలను కనిపెట్టుట ఈ మూడింటిని ఆచరించు ! 1. సత్యము 2.అహింస 3.ప్రేమ తత్త్వము ఈ మూడింటికి దూరంగా ఉండు ! 1.ఇతరులగురించి చర్చ 2.వాద వివాదాలు 3.నాయకత్వం ఈ మూడింటి పట్ల దయతో ఉండు ! 1.అబల 2.పిచ్చి వాడు 3.దారి తప్పిన వాడు ఈ మూడింటి పట్ల దయ తలచవద్దు ! 1. పాపము 2. బద్దకము 3.స్వేచ్చా ప్రవర్తన ఈ మూడింటిని వశము నందు ఉంచుకో ! 1.మనసు 2.కామేంద్రియము 3.నాలుక ఈ మూడింటి పట్ల మమకారం కలిగి ఉండు ! 1.ఈశ్వరుడు 2.సదాచారము 3.పేదలు ఈ ముగ్గురి పట్ల వినయం కలిగి ఉండు ! 1.తల్లి 2.తండ్రి 3.గురువు ఈ మూడింటిని హృదయము యందు ఉంచుకో ! 1.దయ 2.క్షమ 3.వినయము ఈ మూడు వ్రతాలు పాటించు ! 1.పరస్త్రీని మోహించ కుండుట 2.పర ధనము పట్ల ఆసక్తి లేకుండుట 3. అసహయులకు సేవ చేయుట ఈ ముగ్గురిని పోషించడం నీ కర్తవ్యం ! 1. తల్లిదండ్రులు 2.భార్య బిడ్డలు 3.దుఖములో ఉన్నవారు ఈ ముగ్గురి పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపు ! 1.వితంతువు 2.అనాధలు 3.నిరాధారులు ఈ మూడింటిని లెక్క...