జీవితంలో ముఖ్యమైన 3


ఈ మూడు విషయాలలో జాగ్రతగా ఉండు !

1. నిన్ను నీవు పొగడుకొనుట

2. పరనింద

3.పరుల దోషాలను ఎంచుట


ఈ మూడింటిని ఎల్లప్పుడూ జ్ఞాపకం ఉంచుకో !

1. దైవ నామ స్మరణ

2.పరులను గౌరవించుట

3.నీలోని దోషాలను కనిపెట్టుట


ఈ మూడింటిని ఆచరించు !

1. సత్యము

2.అహింస

3.ప్రేమ తత్త్వము


ఈ మూడింటికి దూరంగా ఉండు !

1.ఇతరులగురించి చర్చ

2.వాద వివాదాలు

3.నాయకత్వం


ఈ మూడింటి పట్ల దయతో ఉండు !

1.అబల

2.పిచ్చి వాడు

3.దారి తప్పిన వాడు


ఈ మూడింటి పట్ల దయ తలచవద్దు !

1. పాపము

2. బద్దకము

3.స్వేచ్చా ప్రవర్తన


ఈ మూడింటిని వశము నందు ఉంచుకో !

1.మనసు

2.కామేంద్రియము

3.నాలుక


ఈ మూడింటి పట్ల మమకారం కలిగి ఉండు !

1.ఈశ్వరుడు

2.సదాచారము

3.పేదలు


ఈ ముగ్గురి పట్ల వినయం కలిగి ఉండు !

1.తల్లి

2.తండ్రి

3.గురువు


ఈ మూడింటిని హృదయము యందు ఉంచుకో !

1.దయ

2.క్షమ

3.వినయము


ఈ మూడు వ్రతాలు పాటించు !

1.పరస్త్రీని మోహించ కుండుట

2.పర ధనము పట్ల ఆసక్తి లేకుండుట

3. అసహయులకు సేవ చేయుట


ఈ ముగ్గురిని పోషించడం నీ కర్తవ్యం !

1. తల్లిదండ్రులు

2.భార్య బిడ్డలు

3.దుఖములో ఉన్నవారు


ఈ ముగ్గురి పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపు !

1.వితంతువు

2.అనాధలు

3.నిరాధారులు


ఈ మూడింటిని లెక్క చేయవద్దు !

1.ధర్మాన్ని పాటించే సమయంలో కలిగే కష్టాన్ని

2.పరుల కష్టాన్ని తొలగించేటప్పుడు కలిగే ధన నష్టాన్ని

3.రోగికి సేవ చేయునప్పుడు శరీరానికి కలిగే కష్టాన్ని


ఈ మూడింటిని మరిచిపో !

1. నీవు ఇతరులకు చేసిన సాయం

2. ఇతరులు నీకు చేసిన కీడు

3.డబ్బు, గౌరవం, సాధనల వల్ల సమాజంలో నీకు కలిగిన ఉన్నత స్థితి


ఈ మూడు విధాలుగా మారకు !

1. కృతగ్నుడు

2. డాంబికుడు

3. నాస్తికుడు


ఆస్ట్రో గురు - త్రికాలజ్ఞాన విభూషణ

పండిత డా. గానుగుల యుగంధరాచార్య గురూజీ ......🖋

విజయవాడ

Comments

Popular posts from this blog