Posts

Showing posts from April, 2022
Image
  ఆదివారం అత్యంత శక్తివంతమైన రోజు............!! పూర్వం మన దేశములో ఆది వారం సెలవు దినం కాదు . నెలలో పున్నమి, అమావాస్య రోజుల్లో మాత్రమే సెలవులు ఇచ్చేవారట. ఇదే తరువాత రోజుల్లో నానుడి అయింది -అమావాస్యకో పున్నమికో అంటుంటాము కదా? ఇక పోతే నేడు మనం సెలవు దినంగా భావించే ఆదివారము ఆంగ్లేయుల కాలం నుండి మొదలయింది . ఆదివారం మనకి చాలా శక్తివంతమైన దినం. ఈ ఆదివారము మనకు సూర్యారాధన దినము , చాలామంది అప్పట్లో సూర్యారాధన చేసేవాళ్ళు . భారతీయులు యొక్క మేధస్సుకు, శక్తికి ఈ ఆదివార దీక్ష కారణం అని తెలుసుకున్న తెల్లవారు బలవంతంగా (10-6-1890) మనకి ఆదివారం సెలవును పులిమారు. ఇపుడు ఆది వారం అంటే సెలవు దినం , మందు మాంసాల దినం అయింది కానీ అంతకు ముందు అదో సుదినం మనకు . అప్పటిలో ఉన్న వృత్తి విద్యల్లో ఉన్నవాళ్ళకి సెలవులు అంటూ ప్రత్యేకంగా ఏమి ఉండేవి కావు. విద్యార్థులకు మాత్రం గురుకులా ల్లో పక్షానికి నాలుగు దినాలు- పాడ్యమి, ఆష్టమి, చతుర్దశి, పూర్ణీమ- అమావాస్య రోజులు అవిద్య దినాలని విద్య నేర్పే వారు కాదు. మనం వాల్మీకి రామాయణములో అశోకవనంలో ఉన్న సీతమ్మను "ప్రతిపద్ పాఠశిలస్య విద్యేవ తనుతాంగతా" అని వర్ణించాడ...
Image
గోవు మరియు గేదె పాలల్లోని ఆంతర్యం గేదె కు బురద అంటే చాలా ఇష్టం. గోవు తన పేడ లో కూడా తను కూర్చోదు. గోవుకు స్వచ్ఛత అంటే చాలా ఇష్టం. గేదెను 2kms దూరం తీసుకు వెళ్లి వదిలేస్తే.. ఇంటికి తిరిగి రాలేదు. దానికి జ్ఞ్యాపక శక్తి జీరో. ఆవు ను 5kms దూరం తీసుకు వెళ్లి వదిలేసినా, ఇంటి దారి మర్చిపోకుండా తిరిగి వచ్చేస్తుంది. *గోవు పాలల్లో స్మరణ శక్తి ఉంటుంది.* పది గేదెలను కట్టి, వాటి పిల్లలను విడిచిపెడితే ఒక్క పిల్ల కూడా దాని తల్లిని గుర్తించలేదు. గాని ఆవు దూడ అలా కాదు, తన తల్లి కొన్ని వందల ఆవుల మధ్య లో ఉన్నా గుర్తించగలదు. పాలను తీసేటప్పుడు గేదె తన పాలను మొత్తం ఇచ్చేస్తుంది. గోవు తన పిల్ల కోసం పొదుగు లో కొంచం పాలను దాచిపెడుతుంది. అది పిల్ల త్రాగేటప్పుడు మాత్రమే వదులుతుంది. *నాటు ఆవు పాలల్లో వాత్సల్య గుణం ఉంటుంది* గేదె ఎండ లేదా వేడిమి ని తట్టుకోలేదు. ఆవు మే - జూన్ ఎండలను సైతం తట్టుకోగలదు. గేదె పాలు భారీ గా ఉండి తొందరగా అరగవు. దాని వల్ల చలాకి తనం ఉండదు. పాలను తీసే సమయం లో దూడను యజమాని దానిని లేపుతాడు. ఆవు దూడ తాడు ఇప్పడం చాలా కష్టం గా ఉంటుంది. పాలు తీసాక కూడ దూడను మనం కంట్రోల్ చేయలేము. ఆవు వీపు పైన ఉండే ...
Image
జీవుడు దేహాభిమనాన్ని వదిలితే - జీవుడు దేవుడే...!! గోపికలు దేహాభిమానాన్ని వదిలారు... అది ఎలా అనగా... వస్త్రాపహరణ లీల, దేహాన్ని వస్త్రంతో పోల్చారు వేదాంతంలో... వస్త్రాన్ని హరించటమంటే దేహాభిమానాన్ని హరించటమే, అందుకే చిన్నికృష్ణుడు తమ ఇండ్లలో కుండలను పగలగొట్టి వెన్నను దొంగలించినప్పుడు అంటుంటారు... "కృష్ణా మా ఉపాధులనే కుండలను పగులగొట్టి హృదయమనే వెన్నను దొంగాలించావా.. ఎంత దొంగవయ్యా నీవు".. అని...  అసలు భగవంతుడు మనకు మనోబుద్ధులను ప్రసాదించింది మోక్షాన్ని అందుకొనుటకే... కాలం వృధా చేసుకోకుండా వాటి సహాయంతో సాధన చేసి మోక్షాన్ని పొందాలి... భగవంతుడిచ్చిన వాటిని తిరిగి ఆయనకే సమర్పించాలి, లేకపోతే భగవత్ ద్రోహులమవుతాం... మనసు నిజంగా గయ్యాళిగంప, అది తనకు నచ్చిన పనులు చేస్తుందే గాని మనం చెప్పిన పనులు చేయదు...  తల దువ్వుకోటానికో , బొట్టు పెట్టుకోటానికో , చీరలు నగలు సింగారించుకోటానికో , బూటు పాలిష్ చేసుకోవటానికో , కాలరు టై బిగించుకోటానికో , పౌడర్లు, స్నోలు రాసుకోవటానికో గంటలు గంటలు ఖర్చు పెడుతుంది గాని, జపం చెయ్యటానికో, ధ్యానం చెయ్యటానికో పట్టుమని 10 నిమిషాలు కేటాయించదు... ఏదో కొంపలు మునిగిపోయినట...