పసుపు కొన్ని వేల సం. క్రితం నుండే మన పూర్వీకులు.. గుడిలో పులిహోర లో పసుపు.. పెళ్లికి అక్షింతలలో పసుపు.. స్త్రీ ముఖరవిందానికి పసుపు.. ఇలా.. ఎందుకు పసుపు ని అంతలా వాడి వుంటారు..?? పసుపు శుభం అంటారు, ఎందుకంటే పసుపు వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో తెలిస్తే ఖచ్చితంగా షాక్ అవుతారు. పసుపు వల్ల లాభాలు : 1. పాలు వేడిచేసి వాటిలో చిటికెడు పసుపు, మిరియాల పొడి కలిపి రాత్రి పడుకునే ముందు తాగితే దగ్గు తగ్గుతుంది. 2. సువాసన భరితమైన మరువాన్ని పసుపులో కలిపి నూరి రాస్తే చర్మవ్యాధులు తగ్గుతాయి. 3. పసుపు కొమ్ములను నూరి, నీళ్ళలో అరగదీసి గాని, పసుపు పొడిని పేస్ట్‌లా నీళ్ళతో చాది గానీ కడితే సెగ్గడ్డలు - కరుపులు మెత్తబడతాయి. పుళ్లు మానుతాయి. 4. వేపాకు, పసుపు కలిపి నూరి ఆ పేస్ట్‌ను రాసుకుంటే మశూచి పొక్కులు, గజ్జి, తామర మొదలైన చర్మవ్యాధులలో దురద, మంట, పోటు తగ్గుతాయి. 5. పసుపు కలిపిన నీటిలో పరిశుభ్రమైన వస్త్రాన్ని ముంచి బాగా నాననిచ్చి, నీడన ఆరబెట్టి కాస్త తడి పొడిగా ఉంటుండగానే కళ్లు తుడుచుకుంటూ ఉంటే కంటి జబ్బులు తగ్గుతాయి. 6. వేప నూనెలో పసుపు కలిపి వేడిచేసి, కురుపులకు- గాయాలకు, గజ్జి, చిడుము లాంటి చర్మరోగాల...