🚩 శివాలయాలు - వాటి విశిష్టత
🔰 మహానంది
శివలింగ అడుగునుండి వచ్చే నీటితో కొన్నివేల ఎకరాలు పంటభూమి పండుతున్నది.
బయట ఉండే కొనేరులో గుండుసూది వేసినా కనపడుతుంది.
ఎంత చలికాలంలో కూడా కొనేరులో నీరు గోరు వెచ్చగా ఉంటుంది.
🔰 ప్రకాశం జిల్లా పొన్నలూరు మండలం (కందుకూరు కనిగిరి మధ్య )
కె. అగ్రహారంలో ని కాశివిశ్వేశ్వర దేవాలయం లోని శివలింగం క్రిందనుండి నీరు ఊరుతూ ఉంటుంది. ఈ నీరు 14గ్రామాలకు తాగునీరుగా వాడుతున్నారు.
🔰 ఆదిలాబాద్ జిల్లాలోని శ్రీ బుగ్గా రామేశ్వరాలయం.
ఈఅలయంలో శివలింగంనుండి నీరు ఊరుతూ ఉంటుంది.
🔰 కరీంనగర్ జిల్లాలో కాళేశ్వరము దేవాలయంలో నంది ఉత్తరాయణంలో ఉత్తరముఖంగాను దక్షిణాయణంలో దక్షిణ వైపు తిరుగుతారు.ఇది వండర్
🔰 అలంపూర్ బాల బ్రహేశ్వర లింగానికి ఎన్ని నీళ్ల ట్యాకులతోనైనా అభిషేకం చెయ్యండి .కానీ ఆనీరు ఎటుపోతుందో ఎవ్వరికీ తెలియదు.
🔰 వరంగల్ జిల్లా వెయ్యిస్తంభాల గుడి
ఇక్కడ సంగీత స్తంభాలు గలవు.
ఇక్కడ నందిని మీటితే కంచు శబ్దం వస్తుంది.
🔰 ద్రాక్షారామం ఈ శివలింగం
పై ఉదయం సాయత్రం సూర్య కిరణాలు పడతాయి.
🔰 భీమవరంలో సోమేశ్వరుడు.
ఇక్కడ శివలింగం అమావాస్యకు నల్లగా పౌర్ణమికి తెల్లగా రంగులు మారతారు
🔰 కోటప్పకొండ ఎటుచూసినా 3 శిఖరాలు కనిపిస్తాయి.
ఇక్కడికి కాకులు అసలు రావు
🔰గుటూరు జిల్లా చేజర్ల
ఇక్కడ స్వామిపేరు కపోతేశ్వర స్వామి .
లింగానికి దక్షిణ భాగంలో ఉన్న రంద్రంలో నీళ్లుపోస్తే శవంకుళ్లిన వాసన వస్తుంది.
ఉత్తరభాగంలో నీరుపోస్తే అవి ఎక్కడికి పోతాయో ఎవ్వరికీ తెలీదు.
🔰 బైరవకొన ఇక్కడ కాకులు రావు.
అలాగే ఇక్కడ ఉన్న కొనేరులో ఎంత నీరు వరదలా వచ్చినా గుడిలోకి నీరురాదు.
🔰 యాగంటి ఇక్కడ రోజురోజుకు నంది పెరుగుతూ ఉంటాడు
🔰 శ్రీశైలం భ్రమరాంబిక దేవాలయము వెనుక ఒకప్పుడు "జుం"తుమ్మెద శబ్దం వినపడేదట
🔰 కర్నూలు జిల్లాసంగమేశ్వరం లో వేపచెట్టు మొద్దు ఇక్కడ శివలింగంగా మారింది.
6నెలలు ఈదేవలయం నీటిలో మునిగి ఉంటుంది. 6నెలలు బయటకు కనిపిస్తుంది.
🔰 శ్రీకాళహస్తి లో వాయురూపములో శివలింగం ఉంటుంది.
🔰 అమర్ నాద్ శ్రావణ మాసంలో ఇక్కడ స్వయంగా మంచు శివలింగం ఏర్పడుతుంది.
🔰 కర్ణాటకలోని శివగంగ ఇక్కడ శివలింగంపై నెయ్యివుంచితే వెన్న అవుతుంది.
ఇక్కడఒక్క మకర సంక్రాంతి రోజు మాత్రమే గంగాజలం ఉద్బవిస్తుంది.
మిగిలిన రోజులలో ఒక్క చుక్క కూడా కనిపించదు.
🔰 మహారాష్ట్రలో కోపినేశ్వర్ అనే దేవాలయంలో ప్రతి సంవత్సరము శివలింగము పైకి పెరుగుతుంది.
నంది విగ్రహము శివలింగం వైపు జరుగుతూ ఉంటుంది.
🔰 కంచి
ఇక్కడ మామిడి చెట్టు వయస్సు 4000 సంవత్సరాలు.
🔰 తమిళ నాడు తిరు నాగేశ్వరము
ఇక్కడ పాలతో అభిషేకం చేస్తే నీలంగా మారుతాయి.
🔰 చైనాలో కిన్నెర కైలాసము
ఇక్కడ ఉన్న శివలింగము ఉదయం తెల్లగా,మధ్యాహ్నం పసుపుగా,,సాయంత్రం తెలుపుగా,రాత్రి నీలంగా మారుతాడు.
పండిత డా. గానుగుల యుగంధరాచార్య గురూజీ ......🖋
విజయవాడ
చరవాణి : 76 984 66 666
Comments
Post a Comment