పాలు చేసిన తపస్సు  
(ఒక చిన్న కథ)

ఒకసారి "పాలు" తపస్సు చేసిందట - దేవుడు ప్రత్యేక్షమై ఏమి నీ సమస్య అన్నాడట -

అప్పుడు "పాలు" ఇలా చెప్పిందట. దేవుడా నేను ఆవు నుంచి, బర్రె నుంచి వచ్చినప్పుడు శుద్ధంగానే ఉంటాను. అయితే ఈ పాపిష్టి మానవుడు నాకు పులుపు వేసి నా మానసును విరిచేస్తున్నాడు.

అప్పుడు దేవుడు ఓ నవ్వు నవ్వి "ఓ పాలు" ఇది విను నీవు "పాలలా" జీవించాలి అని ఆశ పడే ముందు ఈ మాటలు విను నీవు

పాలలాగా అయితే ఒకరోజు మాత్రమే బ్రతుకుతావు

పాలకు పెరుగు వేస్తే రెండు రోజులు బ్రతుకుతావు

పెరుగుని చిలికితే పుల్లపుల్లగా ఇంకో రెండు రోజులు బ్రతుకుతావు

మజ్జిగ లోంచి వచ్చిన వెన్న అయితే వారాలు వారాలు అయినా ఏమీ కాదు.

వెన్నను బాగా కాచి దాంట్లో రెండు తమలపాకులు వేసి నెయ్యి చేస్తే మంచి ఘుమఘుమలతో చాలా రోజులు ఉంటావు. అలాగే మందులకు వాడుతారు,

ఆ నెయ్యితోనే దీపం పెడితే నాకు వెలుగువవుతావు....

ఇప్పుడు చెప్పు
ఒకరోజు పాలగా ఉండి "పాలలాగానే" చస్తావా లేక
క్షణక్షణం అనుక్షణం, రోజు రోజూ పెరిగి రూపాంతరం చెంది నాకు వెలుగువవుతావా అని దేవుడు ప్రశ్నించాడు....

దేవుని మాటకి "పాలు" మూగవోయింది, దాసోహం అయ్యింది. తన మనసులో ఉన్న అంధకారానికి సిగ్గుపడి బయటకు వచ్చింది. దేవుని ముందు ప్రజ్వలించి దీపంలా నిలిచిపోయింది...

మనం అలానే కదా.......

నా మనసుకు ఎవరో పులుపు వేశారు అని బాధపడేకంటే - 

పాలై, పెరుగై, మజ్జిగై, నెయ్యిగా మారి దేవుని ముందు దీపంలా బ్రతుకుదాం.......


ఆస్ట్రో గురు - త్రికాలజ్ఞాన విభూషణ

పండిత డా. గానుగుల యుగంధరాచార్య గురూజీ ......🖋

విజయవాడ

Comments

Popular posts from this blog