5 సంఖ్య - విశేషాలు
పంచ మన్మథుని బాణాలు :
అరవిందం = తామర పువ్వు, అశోకం = అశోకవృక్షం పువ్వు, చూతం = మామిడి పువ్వు, నవమల్లిక = అప్పుడే విరిసిన మల్లె పువ్వు, నీలోత్పలం = నల్ల కలువ
పంచ-ఉపవిఘ్నములు :
(యోగమునకు కలుగు ఉపవిఘ్నములు) 1. దుఃఖము, 2. దౌర్మనస్యము, 3. అంగమేజయత్వము, 4. శ్వాసము, 5. ప్రశ్వాసము. "దుఃఖ దౌర్మనస్యాంగమేజయత్వ శ్వాస ప్రశ్వాసా విక్షేపసహభువః" [పాతంజలయోగసూత్రములు 1-31]
పంచ లోహాలు :
వెండి,ఇనుము, బంగారము,సీసము, రాగి
పంచ జ్ఞానేంద్రియాలు :
శ్రోత్రం (చెవులు), త్వక్కు (చర్మం), చక్షు (కళ్లు), జిహ్వ (నాలుక), ఘ్రాణం (ముక్కు)
పంచ కర్మేంద్రియాలు :
వాక్కు, పాణి, పాద, భగము, ఉపస్థ
పంచ కర్మలు:
తర్కశాస్త్రంలో: ఉక్షేపణం, అవక్షేపణం, అకుంచనం, ప్రసారణం, గమనం ;
వైద్యశాస్త్రంలో: వమనం, రేచనం, నస్యం, అనునాసనం, నిరూహం
పంచ విషయాలు :
శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములు
పంచ ప్రాణాలు :
ప్రాణము, అపానము, వ్యానము, ఉదానము, సమానము
పంచ పాండవులు :
ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు
పంచ భూతాలు :
భూమి, ఆకాశము, వాయువు,జలము, అగ్ని
పంచ లింగాలు :
పృథ్విలింగం, ఆకాశలింగం, జలలింగం, తేజోలింగం, వాయులింగం
పంచమహాపాతకములు :
1.స్త్రీ హత్య. 2. శిశుహత్య, 3. గోహత్య. 4. బ్రహ్మహత్య. 5. గురుహత్య
పంచమత గ్రంధములు :
1.భగవద్గీత, 2. ధర్మపదము, 3. బైబులు, 4. ఖురానీషరీఫ్, 5. దివ్వగ్రంధము.
పంచభక్తులు :
1.పితృభక్తి, 2. రాజభక్తి, 3. గురుభక్తి, 4. దేశభక్తి, 5. దైవభక్తి.
పంచ పర్వముల కర్మలు :
1.కృష్ణాష్టమి. స్నానము. 2. కృష్ణ చతుర్ధశి. దానము. 3. అమావాస్య. తర్పణము. 4. పౌర్ణము. దేవతారాధన. 5. సంక్రాంతి. దేవోత్సవములు (పితృ కార్యములు.)
పంచ పత్రములు :
1.తులసి. 2. బిల్వము. 3.శమీపత్రము. 4. మాచీ పత్రము. 5. రుద్రజడ
పంచ పతివ్రతలు :
1.సీత. 2. సావిత్రి. 3. అనసూయ 4. ద్రౌపతి. 5. దమయంతి.
పంచనియమములు :
1.శౌచము, 2. సంతోషము, 3. తపస్సు, 4. స్వాధ్యాయము, 5. ఈశ్వరప్రణిధానము.
పంచధాతువులు :
1.బంగారము, 2. వెండి, 3. రాగి, 4. కంచు, 5. ఇనుము
పంచ ధర్మములు :
1.జాతి ధర్మము. 2. ఆశ్రమ ధర్మము. 3. మత ధర్మము. 4. దేశ ధర్మము. 5. గుణ ధర్మము.
పంచదేవతలు :
1.మహాదేవతలు, 2. కర్మదేవతలు, 3. ఆజానజ దేవతలు, 4. పితృదేవతలు. 5. గందర్వలు.
పంచ జయతిధులు :
1.శుద్ధ ఏకాదశి. 2. ద్వాదశి. 3. త్రయోదశి. 4. చతుర్ధశి. 5. పౌర్ణము.
పంచగవ్యములు :
1.గోమూత్రము, (ఆవు పంచితము), 2. గోమయము (ఆవు పేడ) 3, గీక్షీరము (ఆవు పాలు) 4. గోదధి (ఆవు పెరుగు) 5. గోఘృతము (ఆవు నెయ్యి)
పంచక్షీర వృక్షములు :
1.మఱ్ఱి. 2. రావి. 3. జువ్వి. 4. మేడి. 5. గంగరావి.
పంచకావ్యములు - తెలుగులో :
1. శృంగార నైషధము, 2. మనుచరిత్ర, 3. పారిజాతాపహరణము., 4 వసుచరిత్ర, 5. విజయవిలాసము.
పంచకావ్యములు - సంస్కృతంలో :
1. రఘువంశము, 2.కుమార సంభవము, 3. శిశుపాలవధ 4.మేఘసందేశము, 5.కిరాతార్జునీయము
పంచ కషాయ వృక్ష ద్రవ్యములు :
1.జువ్వి. 2. రావి. 3. మోడి. 4. దిరిసెన., 5. మర్రి పట్ట.
పంచకళ్యాణి : (గుఱ్ఱమునకు వుండవలసినవి)
1. నాలుగు కాళ్ళు. 2. ముఖముపై తెల్లటి చుక్క. 3. తెల్లటి కుచ్చు తోక. 4. తెలుపురంగు వీపు. 5. తెలుపు రంగు మెడజూలు.
పంచకల్పములు :
1.మందారము. 2. పారిజాతము. 3. సంతానము. 4. హరిచందనము. 5. కల్పవృక్షము.
పంచ కర్మ సాక్షులు :
1.సూర్యుడు. 2. చంద్రుడు. 3. యముడు. 4. కాలము. 5. పంచ భూతములు
పంచకర్తల దేవేరులు :
1. బ్రహ్మపత్ని, సరస్వతి, 2. విష్ణుపత్ని... లక్ష్మి, 3. రుద్రపత్ని.... పార్వతి, 4. ఈశ్వరుని పత్ని.... ఉన్మని, 5. సదాశివపత్ని.... మనోన్మని.
పంచ ఋషులు :
సానగ బ్రహ్మఋషి, సనాతన బ్రహ్మఋషి, అహభువన బ్రహ్మఋషి, ప్రత్నస బ్రహ్మఋషి, సుపర్ణస బ్రహ్మఋషి
పంచామృతములు :
1. నీరు. 2. పాలు 3. పెరుగు.4. నెయ్యి. 5. తేనె
మాతృపంచకములు :
1.పెంచిన తల్లి, 2. గురువు భార్య, 3. భార్యను గన్న తల్లి, 4. తనను గన్న తల్లి, 5. అన్న భార్య.
పంచగంగలు :
1. గంగానది. 2. కృష్ణానది. 3. గోదావరి నది. 4. తుంగభద్ర నది. 5. కావేరి నది
పంచమహాపాపములు :
1. బంగారము దొంగిలించుట. 2. సురాపానము. 3. బ్రహ్మహత్య. 4. గురుపత్నీగమనము, 5. మహాపాతకుల సహవాసము
పంచాంగములు :
జ్యోతిషం ప్రకారం అందులోని ఐదు అంగములు. అవి.......... 1.తిథి, 2. వారము, 3. నక్షత్రము, 4.యోగము, 5. కరణము.
పంచసూతకములు :
1. జన్మ సూకకము. 2. మృత సూతకము. 3. రజఃసూతకము. 4. అంటు (రోగ)సూతకము. 5. శవదర్శన సూతకము.
పంచసూక్తములు :
1. పురుష సూక్తము. 2. దేవీ సూక్తము. 3. సూర్య సూక్తము. 4. వర్జన్యసూక్తము. 5. శ్రీసూక్తము;
పంచశుద్ధులు :
1.మనశ్శుద్ధి 2. కర్మశుద్ధి, 3. బాండశుద్ధి, 4. దేహశుద్ధి, 5. వాక్ శుద్ధి
పంచవిధ శకములు :
1. క్రీస్తు శకము. 2. విక్రమార్క శకము. 3. శాలివాహన శకము. 4. హిజరీ శకము. 5. ఫసలీ శకము.
పంచవిధ ధన వారసులు :
1. తాను. 2. తండ్రి. 3. తాత. 4. కొడుకు, 5. కొడుకు కొడుకు
పంచవిధ దేవతా పీఠములు :
1.పద్మ పీఠము. 2. శేషపీఠము. 3.కుముద పీఠము. 4. సోమ పీఠము. 5. భద్ర పీఠము.
పంచవాయువులు :
1.ప్రాణము. 2. అపానము. 3. వ్యానము. 4. ఉదానము. 5. సానవాయువు.
పంచ దోషములు :
1. వ్యభిచారము, 2. విరోధము, 3. సత్ప్రతిపక్షము, 4. అసిద్ధి, 5. బాధ.
1. కామము, 2. క్రోధము, 3. భయము, 4. నిద్ర, 5. శ్వాసము.
1. మిథ్యాజ్ఞానము, 2. అధర్మము, 3. శక్తిహేతువు, 4. ద్యుతి, 5. పశుత్వము.
పంచయజ్ఞములు:
"అహుతం చ హుతం చైవ తథా ప్రహుతమేవ చ, బ్రాహ్మ్యం హుతం ప్రాశితం చ పంచయజ్ఞాన్ ప్రచక్షతే"
(నిత్య యజ్ఞములు) 1. స్నానము, 2. దానము, 3. తపస్సు, 4. హోమము, 5. పితృయజ్ఞము.
1. జపము, 2. హోమము, 3. బలి, 4. బ్రాహ్మణ శ్రేష్ఠుని పూజించుట, 5. పితృతర్పణము.
1. అగ్నిహోత్రము, 2. దర్శపూర్ణ మానము, 3. చాతుర్మాస్యము, 4. పశుయాగము, 5. సోమయాగము.
పంచ మకారాలు :
మద్యం, మాంసం, మత్స్యం, ముద్ర, మైథునం
పంచాక్షరి :
శివ పంచాక్షరీ మంత్రం : ఓం నమశ్శివాయ:
విష్ణు పంచాక్షరీ మంత్రం : ఓం నారాయణాయ:
పంచాయుధములు : శ్రీ మహావిష్ణువు ఆయుధాలు :
శంఖము - పాంచజన్యము, చక్రము - సుదర్శనము, ఖడ్గము - నందకము, గద - కౌమోదకి, ధనుస్సు - శార్ఙము
పంచ యజ్ఞాలు :
వేదపఠనం, వైశ్వదేవం, అతిథిపూజ, పితృతర్పణం, భూతబలి
పంచ ధర్మములు :
1. జాతి ధర్మము: 2. ఆశ్రమ ధర్మము. 3.మత ధర్మము.4.దేశ ధర్మము. 5.గుణ ధర్మము.
పంచ-సూత్రములు :
1. సంకల్పము, 2. మార్జనము, 3. వరుణ సూక్తము, 4. అఘమర్షణము, 5. స్నానాంగతర్పణము.
1. ఆపస్తంభీయము, 2. ఆశ్వలాయనీయము, 3. కాత్యాయచనీయము, 4. బోధాయనీయము, 5. వైఖానసీయము.
ఆస్ట్రో గురు - త్రికాలజ్ఞాన విభూషణ
పండిత డా. గానుగుల యుగంధరాచార్య గురూజీ ......🖋
విజయవాడ

Comments
Post a Comment