శ్రీ మాత్రే నమః
దశరా - ఆధ్యాత్మికత
దశహరా నుండి రూపాంతారత చెందింది దశరా
దశ అనగా పది.
పది తలలు గల రావణుడిని హరించిన రోజే దశహరా !
ఇది భౌతికమైన విషయం.
ఆధ్యాత్మికంగా ఆలోచించినట్లైతే - మనిషిలోని పది దుర్గుణాలను లేదా పాపాలను హరించవలసిన రోజు !
అదే నిజమైన దశరా !
ఏమిటా 10 దుర్గుణాలు ?
అవి :
శారీరకంగా చేసే పాపాలు 3.
1. అపాత్రదానం (చేయవలసిన వారికి దానం చేయకపోవడం లేదా మనం చేసిన దానం వృధా కావడం)
2. శాస్త్రాన్ని నమ్మకపోవటం
3. పర స్త్రీ ని లేదా పురుషుని పొందు కోరడం.,సంగమించడం.
నోటి ద్వారా చేసే పాపాలు 4.
1. పరుషంగా మాట్లాడుట.
2. అసత్యాలు చెప్పడం.
3. వ్యర్థ ప్రలాపాలు చేయడం.
4.అసభ్యంగా మాట్లాడుట.
మనసు ద్వారా చేసే పాపాలు 3.
1. పరుల సొమ్మును దొంగిలించాలనే బుద్ధి ఉండటం.
2. ఇతరులకు బాధ కలిగించే పనులు చేయడం.
3. అహంకారం కల్గి ఉండటం.
ఇవి పది పాపాలు !
ఈ పాపాలను హరించుకుందామనీ, ఆ హరించే శక్తి అమ్మ దుర్గామాత మనందరికీ ఇవ్వాలని ఆశిస్తూ........
ఆస్ట్రో గురు - త్రికాలజ్ఞాన విభూషణ
పండిత డా. గానుగుల యుగంధరాచార్య గురూజీ ......🖋
విజయవాడ

Comments
Post a Comment